29-07-2025 01:08:53 PM
ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం భద్రాద్రి జిల్లాలో పర్యటనకు మొదటిసారి వస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఖమ్మం జిల్లా కూసుమంచి పురాతన స్వయంబు శివాలయంను దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.