పర్యాటక రంగ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

01-10-2026 | 08:12pm

ఆసిఫాబాద్(విజయ క్రాంతి): జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) యువరాజ్ మర్మాట్(Additional Collector Yuvaraj Marmat) తెలిపారు. గురువారం ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్‌తో కలిసి అడ ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు వ్యూయింగ్ పాయింట్లు, వాకింగ్ ట్రాక్‌లు, పార్కింగ్, తాగునీరు, మరుగుదొడ్లు, విశ్రాంతి ప్రదేశాలు, లైటింగ్ తదితర మౌలిక వసతుల ఏర్పాటుపై పరిశీలన చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.

మరిన్ని వార్తలు