calender_icon.png 22 October, 2024 | 9:14 PM

భారత్-చైనా సరిహద్దుల్లో 100 కిలోల బంగారం స్వాధీనం

10-07-2024 06:31:47 PM

న్యూఢిల్లీ: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసులు తూర్పు లడఖ్‌లోని భారత్-చైనా సరిహద్దు సమీపంలో 108.060 కిలోల బరువున్న 108 బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. లడఖ్ సెక్టార్‌లో ఇద్దరు అనుమానితుల వద్ద అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు. చరిత్రలో భారీ మొత్తంలో బంగారం పట్టుకోవడం మొదటిసారి అని ఐటీబీపీ అధికారి మీడియాకి తెలిపాడు. ఆపరేషన్‌కు సంబంధించి, ఐటీబీపీ అధికారులు గతంలో లేహ్‌లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. జూలై 9న దక్షిణ సబ్ సెక్టార్‌లో లాంగ్ రేంజ్ పెట్రోలింగ్ ఆపరేషన్‌లో చిస్ములే, నార్బులా టాప్, జక్లే, జక్లా వంటి ప్రాంతాలను కవర్ చేస్తూ సీజ్ చేయడం జరిగిందన్నారు. సరిహద్దుల్లో చొరబాటు, అక్రమ రవాణా ప్రయత్నాలను తనిఖీ చేసేందుకు ఐటీబీపీ బృందాన్ని రంగంలోకి దించినట్లు అధికారులు వెల్లడించారు. నిందితులిద్దరినీ విచారణ అనంతరం కస్టమ్స్‌ డిపార్ట్‌మెంట్‌కు అప్పగిస్తామని చెప్పారు.