కాంగ్రెస్ నాయకుల తీరుపై భగ్గుమన్న బిఆర్ఎస్
చెన్నూర్,(విజయక్రాంతి): కాంగ్రెస్ నాయకులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(Former CM KCR)ను కించపరిచేలా వ్యవహరించిన తీరుపై మంచిర్యాల జిల్లా(Mancherial District) చెన్నూర్ బిఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు చెప్పుల దండలు వేసి నిరసన చేపట్టడంపై బీఆర్ఎస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చిత్రపటాలకు వేసిన చెప్పుల దండలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటుచేసుకుంది.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు గడుస్తున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని విమర్శించారు. ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ తీరును కాంగ్రెస్ జీర్ణించుకోలేక అధికార బలంతో స్థానిక నాయకులను అరెస్టు చేయిస్తోందని ఆరోపించారు. పార్టీ అగ్రనేతలను రాజ్యాంగ విరుద్ధంగా అడ్డుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం నీచ రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.