ఎమ్మెల్యే శంకర్‌పై బిఆర్ఎస్ నాయకుల ఫిర్యాదు
08-09-2026 | 08:45pm
బాన్సువాడ,(విజయ క్రాంతి): మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష నేత కేసీఆర్(KCR) మరణాన్ని కోరడాన్ని ఖండిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్(MLA Veerlapalli Shankar) చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ మంగళవారం బాన్సువాడ(Banswada) పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషల్ లో బిఆర్ఎస్(BRS) నాయకులు పిర్యాదు చేయడం జరిగింది. వెంటనే ఎమ్మెల్యే శంకర్ పై కేసు నమోదు చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు దుద్దాల అంజిరెడ్డి, భాను, మొచి గణేష్, హన్మంత్ పటేల్, విట్టల్, శ్రీనివాస్ గౌడ్, ఇలియాస్, నాయకులు తదితరులు ఉన్నారు.