బాన్సువాడలో బీఆర్‌ఎస్ నాయకుల రాస్తారోకో

08-09-2026 | 05:00am

బాన్సువాడ, సెప్టెంబర్ 7 (విజయక్రాంతి): తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బిఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Party Working President KTR) మాజీ మంత్రి హరీష్ రావు మహిళా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీలోకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలపై పోలీసులు గుర్తుగా ప్రవర్తించి దాడులు చేయడానికి నిరసిస్తూ సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బిఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా బిఆర్‌ఎస్ నాయకులు అ ంజిరెడ్డి మోరల్ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన  420 హామీలను అమలు చేయాలని నల్ల టీషర్టులు వేసుకుని అసెంబ్లీకి వెళ్తున్న సందర్భంలో కేటీఆర్ హరీష్ రావు మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇ ంద్రారెడ్డి సునితా లక్ష్మారెడ్డి పై పోలీసులు ఇష్టారాజ్యంగా దాడి చేయడానికి నిరసిస్తూ రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినట్లు వారు తెలిపారు. రేవంత్ సర్కార్క్ కు వ్యతిరేకంగా నినాదాలు చేసి రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని అన్నారు. దాడులతో అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని రేవంత్ సర్కార్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నార్ల రత్న కుమా ర్, మొచి గణేష్, బాడీ శ్రీనివాస్, మహేష్ అ క్బర్, ఖలీల్, మొగులయ్య, మాకూబుల్, ఇ షక్, అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు