వెయ్యి రోజుల పాలన వెయ్యి అబద్ధాలు
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్రంలో మోసపూరిత హామీలతో అధికారులకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వం 1000 అబద్దాలు, 400 20 మోసాలు, 6 అసత్యాల పేరుతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని బిఆర్ఎస్(BRS) జిల్లా కె రామ్ కిషన్ రెడ్డి, మాజీ జెడ్పి చైర్మన్ లోలం శ్యాంసుందర్ విజయలక్ష్మి ముధోల్ సమన్వయకర్త పడకండి రమాదేవి ఆరోపించారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
కాంగ్రెస్ పార్టీ(Congress Party) మోసాలపై టిఆర్ఎస్ రాష్ట్ర కమిటీ ఎనిమిది రోజుల నిరసనలో అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు 1000 ఓట్లు వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనకు గుర్తుగా ఎద్దేవా చేశారు. మహిళలను ఉద్యోగులను విద్యార్థులను అన్ని రంగాల్లో మోసం చేశారని ఆరోపించారు. టిఆర్ఎస్ అమలు చేసిన సంక్షేమ పథకాలను రద్దు చేసిన రేవంత్ రెడ్డి సర్కార్ ప్రజల విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు మార్గుండ రాము స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ నాయకులు భూషణ్ రెడ్డి జీవన్ రెడ్డి కిరణ్ కారే తదితరులు ఉన్నారు.