బస్సు సమాచారం ఇక ఫోన్‌లోనే!

26-09-2026 | 01:02pm

సిద్దిపేట ఆర్టీసీ బస్టాండ్‌లో ఎంక్వయిరీ నంబర్ ఏర్పాటు

సిద్దిపేట (విజయక్రాంతి): ప్రయాణికుల సౌకర్యార్థం సిద్దిపేట ఆర్టీసీ బస్టాండ్‌(Siddipet RTC Bus Stand)లో ఎంక్వయిరీ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు సిద్దిపేట డిపో మేనేజర్ హెచ్. శ్రీనివాస్(H. Srinivas) తెలిపారు. ప్రయాణికులు బస్సుల రాకపోకలు, అందుబాటులో ఉన్న సర్వీసులు తదితర వివరాలను ఫోన్ ద్వారా తెలుసుకునేందుకు ఈ సౌకర్యం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ ఎంక్వయిరీ నంబర్ 9491510310 ద్వారా 

ప్రయాణికులు తాము వెళ్లాల్సిన గమ్యస్థానానికి సంబంధించిన బస్సు ఎప్పుడు వస్తుందనే సమాచారాన్ని ఫోన్ చేసి తెలుసుకోవచ్చని డిపో మేనేజర్ తెలిపారు. ఆర్టీసీ అందించే సమయానుకూల సేవలు, ప్రయాణికులకు అవసరమైన ఇతర సమాచారాన్ని కూడా ఎంక్వయిరీ నంబర్ ద్వారా పొందే అవకాశం ఉంటుందని చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎంక్వయిరీ నంబర్ అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు