బీజేపీకి బైపోల్ సవాల్

27-09-2026 | 05:25am
  1. కిషన్‌రెడ్డి, రాంచందర్‌రావుకు పరీక్షగా ఖైరతాబాద్
  2. గెలిస్తే 2028కి బూస్టప్.. ఓడితే కష్టకాలమే!
  3. కిషన్‌రెడ్డి లోక్‌సభ సెగ్మెంట్‌లోనే ఖైరతాబాద్
  4. రాంచందర్‌రావు అధ్యక్షుడయ్యాక ఇది రెండో బైపోల్
  5. గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కమలం ఓటమి
  6. ఇప్పుడు గెలవకపోతే సమస్యేనంటున్న పార్టీ నేతలు
  7. అభ్యర్థి ఎంపికపై బీజేపీ నాయకత్వం కసరత్తు

హైదరాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): ఖైరతాబాద్ ఉప ఎన్నిక బీజేపీకి సవాల్‌గా మారింది. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy), పార్టీ అధ్యక్షుడు రాంచందర్‌రావుకు ఇది అగ్నిపరీక్షగా తయారైంది. కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే ఖైరతాబాద్ ఉంది. గతంలో ఇదే ఎంపీ సెగ్మెంట్‌లో ని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోయింది.

దీంతో త్వరలో జరగబోయే ఖైరతాబాద్ బైపోల్‌లో గెలిచి తీరాల్సిన పరిస్థితి ఏ ర్పడింది. ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాం చందర్‌రావు బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న రెండో ఉప ఎన్నిక కావడంతో ఆయనకు కూడా ఇది ప్రతిష్టాత్మకంగా మా రింది. దీంతో అభ్యర్థి ఎంపికపై బీజేపీ నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నది. 

భవిష్యత్తు ఎన్నికలపై ప్రభావం!

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటం, సుప్రీంకోర్టు కూడా హైకోర్టు తీర్పును సమర్థించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ బైపోల్ బీ ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ఎంత ముఖ్య మో అంతే ప్రాధాన్యం బీజేపీకి కూడా ఉంది. భవిష్యత్ ఎన్నికల్లో రాణించాలంటే ఇక్కడ గెలిచితీరాలన్న పట్టుదలతో కమలం పార్టీ ఉంది. ఖైరతాబాద్ నియోజకవర్గం సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఉంది.

అంటే ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సొంత ఇలాకా. గతంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కూడా ఇదే లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనే జరిగింది. జూబ్లీహిల్స్‌లో కాంగ్రె స్ గెలిచింది. ఇప్పుడు ఖైరతాబాద్ ఉప ఎన్ని క  కిషన్‌రెడ్డి లోక్‌సభ నియోజకవర్గం జరుగుతున్న రెండో బైపోల్. ఇక్కడ కూడా బీజేపీ నెగ్గకపోతే.. ‘సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోనే పట్టు లేదా?’ అనే విమర్శలను కిషన్‌రెడ్డిని ఎదుర్కోవాల్సి వస్తు ందని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది.

ఇక, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుకు కూడా ఖైరతాబాద్ ఉప ఎన్నిక సవా ల్‌గా మారింది. ఆయన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది. శక్తివంచన లేకుండా గెలుపు కోసం ప్రయత్నించినప్పటికీ.. అక్కడ బీజేపీ గెలవలేకపో యిందని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పు డు ఖైరతాబాద్ ఉప ఎన్నికలో విజయం రాంచందర్‌రావుకు కూడా అనివార్యమైంది. ఇక్కడ గెలవకుంటే ఈయన హయాంలో బీజేపీ రెండో ఉప ఎన్నికలో కూడా పట్టుకోల్పోయిందనే భావ న ప్రజల్లోకి వెళ్తుంది. ఈ ఎన్నికల ఫలితం ప్రభావం భవిష్యత్‌లో జరిగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, కార్పొరేషన్ ఎన్నికలపైనా పడే అవకాశమూ లేకపోలేదు.

సీనియర్‌కా.. యువ నేతకా..? 

గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 సీ ట్లు గెలిచి హైదరాబాద్‌లో బీజేపీ దూకుడు చూపించింది. కానీ, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో నగరంలో ఒక్క గోషామహల్ మాత్ర మే గెలిచింది. ఖైరతాబాద్‌లో బీజేపీ చివరిసారిగా 2014లో గెలిచింది.. అది కూడా టీడీపీ పొత్తుతో చింతల రామచంద్రారెడ్డి గెలిచారు. ఆ తర్వాత 2018, 2023లో బీజే పీ ఓడిపోయింది. ఈ రెండు ఎన్నికల్లో వరుసగా బీఆర్‌ఎస్ నుంచి దానం నాగేందర్ గెలుపొందారు.

2028 ఎన్నికలకు వెళ్లే ముందు బీజేపీ హైదరాబాద్ నగరంలో త మ బలాన్ని నిరూపించుకోవాలి. వరుస ఉప ఎన్నికల్లో ఓడితే కేడర్ నిరుత్సాపడుతుంది. అది కూడా బీజేపీ ఖాతాలో ఉన్న లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని స్థానం కావడం తో ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఆ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. అభ్యర్థి ఎంపిక సైతం ఇక్కడ కీలకం కానుంది.  యువతకు ప్రాధా న్యం ఇవ్వాలా? లేకపోతే సీనియారిటీకి ప్రా ధాన్యం ఇవ్వాలా? అని యోచిస్తున్నట్లు సమాచారం.

ఇప్పుడు పార్టీలో సీనియర్ నేత చింతల రామచంద్రారెడ్డి, యువ నేతలు ఇంద్రసేనారెడ్డి, బద్దం మహిపాల్ రెడ్డితోపాటు మరికొందరి పేర్లు ప్రాథమికంగా విని పిస్తున్నాయి. మొత్తానికి ఖైరతాబాద్ ఉప ఎన్నిక బీజేపీకి కేవలం ఒక సీటు గెలుపు ఓటముల వ్యవహారం కాదు.. ఇది కిషన్ రెడ్డి లోక్‌సభ నియోజకవర్గంలో పట్టును, రాం చందర్ రావు పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని నిర్ణయించే ఎన్నిక. గెలిస్తే 2028కి బూస్టప్.. ఓడితే హైదరాబాద్‌లో బీజేపీకి మరోసారి బ్రేక్ అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరిన్ని వార్తలు