కిట్స్ మహిళా కళాశాలలో ప్రాంగణ ఎంపికలు

10-09-2026 | 10:36pm

చైర్మన్ నీల సత్యనారాయణ 

కోదాడ,(విజయ క్రాంతి): స్థానిక కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల(KITS Women's Engineering College)లో ప్రాంగణ ఎంపికలు నిర్వహించినట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ(College Chairman Neela Satyanarayana) గురువారం తెలిపారు. హైదరాబాద్ కు  చెందిన  ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఐన ఆఫికల్ సొల్యూషన్  ఆధ్వర్యంలో ప్రాంగణ ఎంపికలు నిర్వహించారు. ఆఫికల్ సాఫ్ట్ సొల్యూషన్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ మానవ వనరుల  నిర్వహణ అధికారి k. సందీప్ మరియు రిక్రూట్మెంట్ జి. కవిత ఎంఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాంగణ ఎంపిక లలో  కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల  బీటెక్ విద్యార్థి నులు  42 మంది విద్యార్థి నులు ఎంపిక అయ్యారు. 

 ఎంపిక అయిన వారికి  విద్యార్థి నులకు వార్షిక వేతనం  5,00,000/-  రూపాయలు  ఉంటుందని కంపెనీ మానవ వనరుల అధికారులు కే. సందీప్ మరియు రిక్రూట్మెంట్ హెడ్  జి. కవిత తెలిపారు.  ప్రాంగణ ఎంపికలకు ఎంపిక అయిన విద్యార్థులను కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ  అభినందించారు .ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ,  టీపీవో పుష్ప లత, వివిధ విభాగాధిపతులు అధ్యాపకులు అభినందించారు.

మరిన్ని వార్తలు