అంబేద్కర్‎పై కల్పిత పుస్తక కుట్రలు.. వారిపై కేసులు నమోదు చేయాలి

19-09-2026 | 12:56pm

ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్

ముకరంపుర, సెప్టెంబరు 19(విజయ క్రాంతి): ఆవారా ప్రసాద్(Aavara Prasad)‎ను తెలంగాణ నుంచి బహిష్కరించాలని, అలాగే అంబేద్కర్‎పై తీసుకువస్తున్న కల్పిత అక్రమ అవాస్తవ, చట్ట వ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక పుస్తక ప్రచురణ కుట్రదారులపై రాష్ట్ర ప్రభుత్వం(State Government) కేసులు నమోదు చేయాలని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు.కరీంనగర్‎లోని కోర్టు వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంబేద్కర్ ఒక హిమాలయ శిఖరం అన్నారు.దాన్ని ముట్టుకున్న వాళ్లు దాని కింద సమిధులు అయిపోతారని అన్నారు. కుట్రల సూత్రధారులను,పాత్రధారులను వెంటనే గుర్తించి వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 

ఈ కార్యక్రమంలో గజ్జల ఆనందరావు,కొంపల్లి రవీందర్,సిగిరి శ్రీధర్,నల్లాల కనకరాజు,గోస్కి అజయ్, కల్లేపల్లి శంకర్,కుతాడి శివరాజు, కుక్కల లక్ష్మి రాజం, గొర్రె రాజయ్య,గాదం రవి, గండి రాజేశ్వర్, తంగేళ్ళ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు