కడ్పల్ లో VBGRMG ఫారం ఫండ్ పనులు పరిశీలన
01-10-2026 | 10:32pm
సిర్గాపూర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో ఉపాధి హామీ (VBGRMG) కింద జరుగుతున్న రైతు జంపాలా శాంతమ్మ లక్ష్మయ్య చేనులో జరుగుతున్న ఫారం ఫండ్ పనులను సెంట్రల్ టీమ్ గురువారం సందర్శించి పరిశీలించింది. బృందం ప్రతినిధులు పనుల వద్ద కూలీలతో మాట్లాడారు. వేతనాలు, సదుపాయాలు, సమస్యల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ శ్రీలక్ష్మీ, అడిషనల్ డీఆర్డీఓ బాలరాజ్, ఏపీడీ విజయలక్ష్మీ, ఎంపీడీఓ ఆండాలమ్మ, ఏపీఓ నర్సిములు, ఈసీ గణపతి, టీఏ కృష్ణ, ఎంపివో బ్రహ్మం, పంచాయతీ కార్యదర్శి రవీందర్ రెడ్డి, సర్పంచ్ విమల విట్టల్ రెడ్డి, ఎఫ్ఏ వెంకట్ రాములు పాల్గొన్నారు.