ఐలమ్మ స్పూర్తితో ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలి

10-09-2026 | 05:03pm

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్

బాన్సువాడ,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) బాన్సువాడ పట్టణంలో చాకలి ఐలమ్మ 41 వర్ధంతి(Chakali Ailamma death anniversary) సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట్ గౌడ్ జిల్లా కమిటీ సభ్యులు జడిగే రవీందర్ లు ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం వెంకట్ గౌడ్ మాట్లాడుతూ... భూమి కోసం వెట్టి చాకిరీ విముక్తి కోసం జమీందారు ను ఎదురించి పోరాడిన వీర వనిత చాకలి ఐలమ్మ స్పూర్తి తో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరుతో ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారని పేదలు మరింత పేదలుగా మారుతున్నారని ఇలానే ఉంటే భవిష్యత్తులో మరింత దుర్లభమైన పరిస్థితులు వస్తాయని ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు CPM పార్టీ  ఆద్వర్యంలో 10 తేదీ నుండి 17 వరకు తెలంగాణ సాయిదా రైతాంగ పోరాటాల వారోత్సవాలు నిర్వహిస్తామని వారోత్సవాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు