సమాజంలో చైతన్యం నింపిన వీరనారి చాకలి ఐలమ్మ
అదనపు ఎస్పీ నరేష్ కుమార్
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు
భూపాలపల్లి టౌన్, సెప్టెంబర్ 26 ( విజయ క్రాంతి ) : సమాజంలో చైతన్యం నింపిన వీరనారి చాకలి ఐలమ్మ(Chakali Ilamma) అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ నరేష్ కుమార్(Jayashankar Bhupalpally District Additional SP Naresh Kumar) అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట(Telangana Armed Struggle) యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా శనివారం భూపాలపల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చాకలి ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట యోధురాలిగా, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని అన్నారు. బానిసత్వం, అణచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన ఆమె పోరాట స్ఫూర్తి, ధైర్యం, ఆత్మగౌరవం నేటి తరానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్మిన్ ఆర్‌ఐ రత్నం, వెల్ఫేర్ ఆర్‌ఐ సంతోష్, పోలీస్ సంఘం అధ్యక్షుడు నరేష్, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.