చలో హైదరాబాద్ వాల్ పోస్టర్ ఆవిష్కరణ
08-09-2026 | 09:40pm
చేర్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల హక్కుల సాధన, ప్రభుత్వ హామీల అమలు కోసం ఈ నెల 10న చేపట్టనున్న చలో హైదరాబాద్ కార్యక్రమ వాల్ పోస్టర్ ను శనివారం చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ నాగేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. పిఆర్సి, ఓపిఎస్ సాధన, పెండింగ్ బిల్లుల చెల్లింపు కోసం పోరాటం చేస్తున్నామని, సెప్టెంబర్ 10న జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఉద్యోగులంతా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.