మోడీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ వన్: చంద్రబాబు
న్యూఢిల్లీ: మోడీ నేతృత్వంలో 2047 నాటికి భారత్ నంబర్ వన్ గా నిలుస్తోందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మోడీ నాయకత్వంలో భారత్ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చంద్రబాబు స్పష్టం చేశారు. మోడీ నేతృత్వంలో భారత్ పేదరిక రహితంగా మారుతోందన్నారు. ఏపీలో 90 శాతం స్థానాలు గెలిచామని చెప్పిన చంద్రబాబు సరైన వేళ సరైన వ్యక్తి ప్రధాని కావడం వల్ల దేశం పురోభివృద్ధి చెందుతోందని చెప్పారు.
మేకిన్ ఇండియాతో భారత్ వృద్ధిపథంలో నడిపారని తెలిపారు. ఎన్డీయేను అధికారంలోకి తేవడానికి మోడీ రేయింబవళ్లు కష్టపడ్డారని చంద్రబాబు వెల్లడించారు.ఏపీలోనూ 3 బహిరంగ సమావేశాలు, ర్యాలీల్లో పాల్గొన్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ ప్రతిష్ఠను ఇనుమడింపచేశారని వ్యాఖ్యానించారు. మోడీ నాయకత్వాన్ని సమర్థిస్తూ రాజ్ నాథ్ సింగ్ తీర్మానం ప్రవేశపెట్టారు. ఎన్డీయే లోక్ సభా పక్ష నేతగా రాజ్ నాథ్ సింగ్ మోడీని ప్రతిపాదించారు. ఎన్డీయే నేతగా మోడీని అమిత్ షా, గడ్కరీ సమర్థించారు. రాజ్ నాథ్ సింగ్ ప్రతిపాదనను చంద్రబాబు,కుమారస్వామి బలపరిచారు.






