4 September, 2026 | 1:23 AM

మోడీ ప్రధాని కావడం అదృష్టం: రాజ్‌నాథ్ సింగ్

07-06-2024 | 12:46pm

న్యూఢిల్లీ: ఎన్డీయే కూటమి నేతల సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. 1962 తర్వాత వరుసగా మూడోసారి ఎవరూ ప్రధాని కాలేదని తెలిపారు. మోడీ దూరదృష్టిని దేశ ప్రజలు ప్రత్యక్షంగా చూశారని చెప్పారు. పదేళ్లపాటు ఎన్డీయే ప్రభుత్వం దేశానికి సేవలందించిందన్న రాజ్ నాథ్ సింగ్ ప్రపంచ దేశాల్లోనూ మోడీని ప్రశంసిస్తున్నారని చెప్పారు. ప్రధానమంత్రి పాత్రకు మోడీ సరిపోతారని, ఆయన ప్రధాని కావడం పార్టీ అదృష్టమని రాజ్ నాథ్ అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ, జేడీయూ, శివసేన, లోక్ జనశక్తి, ఎన్ సీపీ, జేడీఎస్, జనసేన, అప్నాదల్ పార్టీల ఎంపీలు, ఎన్డీయే పార్టీల సీఎంలు, డిప్యూటీ సీఎంలు పాల్గొన్నారు.