పవన్ ఒక సునామీ
07-06-2024 | 02:39pm
న్యూఢిల్లీ: ఎన్డీఏ సమావేశంలో పవన్ కల్యాణ్ పేరును నరేంద్ర మోడీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ''మన సమక్షంలోనే పవన్ కల్యాణ్ ఉన్నారు.. పవన్ కల్యాణ్ అంటే ఒక సునామీ.. పవన్ అంటే పవనం కాదు.. ఒక సునామీ'' అన్నారు. ఏపీలో ఇంత భారీ విజయం ప్రజల ఆకాంక్షలకు అద్దంపట్టిందన్నారు. ఏపీ ప్రజలు తమకు పెద్దఎత్తున మద్దతిచ్చారని తెలిపారు. చంద్రబాబుతో కలిసి చరిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నామని పేర్కొన్నారు. చంద్రబాబు చరిత్రాత్మక విజయం సాధించారని అభినందించానని చెప్పారు. 2024లో ఎన్డీయే మహా విజయం సాధించిందని మోడీ పేర్కొన్నారు.






