జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులుగా చంద్రశేఖర్ రెడ్డి
నారాయణఖేడ్,సెప్టెంబరు 20: సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా నారాయణ ఖేడ్(Narayana Khed)కు చెందిన పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డిని నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కే.సి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు.డిసిసి అధ్యక్ష పదవికి జిల్లాలో పలువురు ప్రముఖ నాయకులు పోటీపడ్డ చివరికి మారుమూల ప్రాంతమైన ఖేడ్‌కు చెందిన చంద్రశేఖర్ రెడ్డికి పదవి వరించింది.
1990నుంచి 1992 వరకు జేఎన్టీయూ విశ్వ విద్యాలయంలో ఎన్ఎస్యుఐ విద్యార్థి సంఘ నాయకునిగా, 1996- 1999 వరకు యువజన కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 2000- 2005 వరకు యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షునిగా, 2008- 2014 వరకు డిసిసి కార్యదర్శిగా, 2015- 2025 వరకు డీసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కృష్ణారెడ్డి కుమారుడైన ఈయన ప్రస్తుత ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డికి స్వయాన సోదరుడు.కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక కార్యకర్తగా పనిచేస్తున్న మారుమూల ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్ రెడ్డి కి పదవి వివరించడం పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.