తూప్రాన్ టోల్ ప్లాజా సమీపంలో రోడ్డు ప్రమాదం

20-09-2026 | 02:17pm

యువకునికి తీవ్ర గాయాలు 

తూప్రాన్ సెప్టెంబర్ 20 (విజయ క్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ టోల్ ప్లాజా(Toopran toll plaza) సమీపంలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వీరేంద్ర 35 తూప్రాన్ నివాసం అనే యువకుడు కాళ్ళకల్ బంగారమ్మా దేవాలయం వద్దకు బైక్ పై వెల్లి తిరిగి వస్తుండగా టోల్ సమీపంలో కొమ్రిగానిగుట్ట వద్ద తనకు తాను పోలుకు గుద్దుకొని గాయపడగా అటువైపు వెళ్తున్న వ్యక్తులు గమనించి అంబులెన్స్ కు ఫోన్ చేసి ప్రభుత్వ దావఖనకు తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి తీవ్ర గాయాలు అయినందున ప్రైవేట్ హాస్పిటల్ కు తీసుకెళ్ళమని సూచించారు. కుటుంబీకులు తక్షణమే హైద్రాబాద్ లోని ప్రైవేట్ తరలించారు.

మరిన్ని వార్తలు