ముగిసిన భారత్ పర్యటన.. చైనాకు జిన్పింగ్
న్యూఢిల్లీ: భారత్ లో చైనా అధ్యక్షుడు షీ జెన్ పింగ్ పర్యటన ముగిసింది. చైనా అధ్యక్షుడు జిన్ పింగ్(Chinese President Xi Jinping) బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఢిల్లీకి వచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీతో(Prime Minister Narendra Modi) జిన్ పింగ్ దైపాక్షిక చర్యలు జరిపారు. సుమారు 45 నిమిషాల పాటు ప్రధాని మోదీ- షీ జిన్ పింగ్ మధ్య చర్చలు జరిగాయి. భారీ ప్రతినిధి బృందంతో ఇరుదేశాల మధ్య చర్యలు జరిగాయి.
ఢిల్లీలోని భారత మండలంలో రెండో రోజు బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు(BRICS Summit-2026) కొనసాగుతోంది. 21 మంది దేశాధినేతలు, అంతర్జాయ సంస్థల ప్రతినిధుల హాజరయ్యారు. వివిధ అంశాలపై బ్రిక్స్ దేశాలతో భారత్ కీలక ఒప్పందాలు చేసుకుందని ప్రధాని వెల్లడించారు. బ్రిక్స్ (BRICS) సమావేశం కోసం వచ్చిన షీ జిన్పింగ్, మోదీతో కేవలం ఒక ద్వైపాక్షిక సమావేశంలో మాత్రమే పాల్గొని, ఆ తర్వాత ప్రత్యేక విందు కార్యక్రమానికి హాజరుకాకుండానే చైనాకు తిరిగి వెళ్లిపోవడం చర్చనీయాంశం అయింది.