మీడియా ప్రధాన కార్యదర్శిగా మారుతి ప్రకాష్ నియామకం
కరీంనగర్ సిటీ, సెప్టెంబర్ 13: తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం(Padmashali Association) రాష్ట్ర మీడియా ప్రధాన కార్యదర్శిగా మారుతి ప్రకాష్ రెండోసారి నియమితులయ్యారు. హైదరాబాద్ నారాయణగూడలోని పద్మశాలి భవన్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పద్మశాలి ప్రజాప్రతినిధుల సన్మాన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కమర్తపు మురళి చేతుల మీదుగా ఆయన నియామక పత్రాన్ని అందుకున్నారు.
సంఘం అభివృద్ధి, చేనేత కార్మికుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రకాష్ కీలకంగా పనిచేశారని నాయకులు తెలిపారు. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పద్మశాలి యువజన సంఘం ప్రచార కార్యదర్శిగా 15 ఏళ్ల పాటు సేవలందించారని గుర్తుచేశారు. తనపై నమ్మకంతో మరోసారి బాధ్యతలు అప్పగించిన నాయకత్వానికి ప్రకాష్ కృతజ్ఞతలు తెలిపారు. మీడియా వేదికగా పద్మశాలి సమాజ సమస్యలు, సంఘం కార్యక్రమాలను ప్రజలకు చేరవేస్తానన్నారు.