48 గంటలు డెడ్‌లైన్
సీఈసీ రాజీనామా చేయకుంటే.. ఢిల్లీ వేదికగా దేశవ్యాప్తంగా ఆందోళనలు
ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలి, ‘సర్’ ప్రక్రియ నిలిపివేయాలి: సీజేపీ నేత అభిజిత్ దీప్కే
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, పౌరుల ఓటు హక్కును హరించివేశారని, ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పుగా పరిణమించారని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ సీఈసీ జ్ఞానేష్ కుమార్ 48 గంటల్లోగా రాజీనామా చేయాలని, లేకుంటే సీజేపీ(Cockroach Janata Party) ఢిల్లీ జంతర్ మంతర్ వేదికగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపడుతుందని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే(CJP leader Abhijeet Dipke) హెచ్చరించారు.
దేశంలోనే ఆయన అతిపెద్ద ద్రోహి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజీనామా చేసేవరకు వెనక్కి తగ్గదే లేదన్నారు. యువత, ప్రజలు తమ ఓటు హక్కును కాపాడుకునేందుకు తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఎస్‌ఐఆర్ సీఈసీ ఏకపక్ష నిర్ణయాలపై పార్టీలన్నీ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అభిజిత్ దీప్కే అన్నారు. గత రెండు మూడు రోజులుగా సీఈసీపై వస్తున్న కథనాలు, ఆరోపణలు, విమర్శల నేపథ్యంలో స్పందించారు. గురువారం సీజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్, అశుతోష్ రాంకాలతో కలిసి ఢిల్లీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎన్నికల సంఘాన్ని సరిదిద్దాలని డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియ లో అవకతవకలు జరిగాయని, పౌరుల ఓటు హక్కును హరించివేస్తూ ప్రజాస్వామ్యానికి ముప్పు తెస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలలో అవకతవకలు జరిగినట్లు భావిస్తే పార్టీలో ఆ ప్రక్రియల్లో పాల్గొనవద్దని పిలుపునిచ్చారు.
ఈ అంశంపై పార్టీలన్నీ ఒకవైఖరి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జ్ఞానేష్ కుమార్ ‘భారత ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు’గా పరిణమించారని దీప్కే సంచలన ఆరోపణలు చేశారు. చివరకు ఎవరు ఎవరికి ఓటు వేయాలో కూడా ఈసీయే నిర్ణయిస్తుందని విమర్శించారు. పౌ రుల ఓటు హక్కును రద్దు చేసేందుకు జ్ఞానేష్ కుమార్ ఎవరు? అని ప్రశ్నించారు. ఆయనపై వెంటనే క్రిమినల్ చర్యలు చేపట్టాలని డిమా ండ్ చేశారు.
దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాల నుం చి 13 కోట్లకు పైగా ఓటర్ల పేర్లను ఎస్‌ఐఆర్ పేరుతో తొలగించారని చెప్పారు. మహారాష్ట్ర కోట్లు, ఉత్తర ప్రదేశ్ కోట్ల, కర్ణాటక తమిళనాడు లక్షలు, పశ్చిమ బంగాల్ లక్షలు, తెలంగాణ 73 లక్షలు, ఢిల్లీ 47 లక్షలు, కేరళ 24 లక్షల పై చిలుకు ఓట్లను తొలగించారని అభిజిత్ దీప్కే ఆరోపించారు. సీజేపీ అధికార ప్రతినిధి సౌరభ్ దాస్ మాట్లాడుతూ.. వెంటనే సీఈసీ రాజీనామా చేయడంతోపాటు, ఆయనపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని, సర్ నిలిపివేయాలని, 2025 ఓటర్ల జాబితానే పరిగణనలోకి తీసుకోవాలని, సర్ ఫైళ్లన్నింటినీ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఓ కమిటీని నియమించి దాని ఆధీనంలో ఉంచాలని డిమాండ్ చేశారు.