అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు
మహబూబ్నగర్ (విజయ క్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(MLA Yennam Srinivas Reddy) అన్నారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 195 మంది లబ్ధిదారులకు రూ.91.03 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటివరకు నియోజకవర్గంలో 2 వేల మందికి పైగా సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సాయం అందించామని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద 5,500 ఇళ్లు మంజూరు చేశామని, మరో 5 వేల ఇళ్లను మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని చెప్పారు. అర్హులందరికీ కొత్త రేషన్ కార్డులు అందించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.