సీఎం రేవంత్ రెడ్డిది డైవర్షన్ పాలిటిక్స్

26-09-2026 | 10:18pm

ముకరంపుర, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట(Telangana Armed Struggle) యోధురాలు చాకలి ఐలమ్మ(Chakali Ilamma) జయంతి వేడుకల్లో బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు(BJP Parliamentary Constituency Convener Boyinapally Praveen Rao) పాల్గొని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. కరీంనగర్లో జరిగిన చాకలి ఐలమ్మ జయంతి  వేడుకల్లో  ప్రవీణ్ రావు పాల్గొని ఆమె విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ రావు  ఐలమ్మ తెగువను, పోరాట పటిమను స్మరించుకుంటూనే కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని  తీవ్రంగా ఎండగట్టారు.

ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను పూర్తిగా విస్మరించారని ఆయన ఆరోపించారు. మూడేళ్లలో  బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ సర్కార్ పెట్టిన కేసుల పురోగతిపై తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీలపై చిత్తశుద్ధి లేదని, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌పై చర్యలు తీసుకునే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు లేవని ఆయన స్పష్టం చేశారు.

చాకలి ఐలమ్మ ప్రదర్శించిన చారిత్రక తెగువ, పోరాట స్ఫూర్తిని ఆయన గుర్తు చేశారు. నిరంకుశ శక్తులను ఎదిరించిన ఐలమ్మ ధైర్యంలో నూటికి  ఒక్క పాళ్లు కూడా నేటి కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిలో లేవని, ప్రజలను మభ్యపెట్టే డైవర్షన్ రాజకీయాలు మాని ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

మరిన్ని వార్తలు