సీఎం సార్.. జర దేఖో!

29-09-2026 | 05:20am
  1. బకాయిలు, ఆర్డర్లపై నేతన్నల ఆశలు
  2. ముంపు గ్రామం కోరిక నెరవేరేనా?

కరీంనగర్/సిరిసిల్ల, సెప్టెంబర్ 28 (విజయక్రాంతి): ఈ నెల 30న ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి(Chief Minister A. Revanth Reddy) కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా(Karimnagar, Rajanna Sircilla District) పర్యటన నేపథ్యంలో, సిరిసిల్ల మరమగ్గాల (పవర్లూమ్) యజమానులు, చేనేత కార్మికులు తాము ఎదుర్కొంటున్న తీవ్రమైన ఉపాధి, ఆర్థిక సంక్షోభ6 నివారణకు పలు కీలక సమస్యలను ప్రభుత్వం ముందు ఉంచుతున్నారు. గత ప్రభుత్వ, ప్రస్తుత కాలానికి సంబంధించిన సుమారు 60 కోట్ల నుండి 300 కోట్ల వరకు వస్త్రోత్పత్తి బిల్లుల బకాయిలను(Outstanding textile production bills) ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

బకాయిలు నిలిచిపోవడం వల్ల కార్మికులకు వేతనాలు(Wages for workers) ఇవ్వలేక యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో ఆర్డర్లు ఇచ్చిన బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ వస్త్రాల కేటాయింపు  తగ్గడం వల్ల మగ్గాలు మూగబోయాయి. నిరంతరాయంగా ఉపాధి లభించేలా ఆర్డర్లను పునరుద్ధరించాలని కోరుతున్నారు. సిరిసిల్లను కాదని వేములవాడలో యార్న్ డిపో ఏర్పాటు చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

వస్త్రోత్పత్తికి తగినంత బడ్జెట్ కేటాయించి, సిరిసిల్లలోనే పూర్తిస్థాయి యార్న్ డిపో అందుబాటులోకి తేవాలని, అలాగే గతంలో ఉన్న 10 శాతం నూలు సబ్సిడీని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు.నేతన్నల సామాజిక భద్రత కోసం నేతన్న బీమా పథకాన్ని(Netanna Insurance Scheme) సమర్థవంతంగా అమలు చేయాలని, వస్త్ర పరిశ్రమ సంక్షోభం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన నేతన్నల కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మగ్గాలకు అవసరమైన 25 హెచ్పీ  ఉచిత విద్యుత్ కనెక్షన్ల మార్పులను వేగవంతం చేయాలని, విద్యుత్ బిల్లులపై ఇచ్చే సబ్సిడీలను క్రమం తప్పకుండా వర్తింపజేస్తూ విద్యుత్ బకాయిల సమస్యలను పూర్తిగా పరిష్కరించాలని కోరుతున్నారు.              -------------

నారాయణపూర్‌పై సీఎం స్పందించేనా?

కరీంనగర్ జిల్లా, గంగాధర మండల పరిధిలోని నారాయణపూర్ రిజర్వాయర్  ముంపు సమస్య పై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన ఎలా ఉంటుందో చూడాలి.   గ్రామాన్ని పూర్తిగా ముంపు గ్రామంగా  ప్రకటించి, తమకు పునరావాసం కల్పించడంతో పాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ కింద నష్టపరిహారం అందించాలని స్థానికులు  డిమాండ్ చేస్తున్నారు. ఇటీవల అధికారులు సర్వే చేయడానికి రాగా, స్పష్టమైన హామీ ఇచ్చేంతవరకు సర్వేను సాగనిచ్చేది లేదంటూ గ్రామస్తులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది.   

ఈ తీవ్రమైన ముంపు సమస్యను స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లారు. గతంలో ఇచ్చిన హామీల మేరకు గ్రామానికి న్యాయం చేయాలని కోరారు.    కలెక్టర్ చిత్రా మిశ్రా నేతృత్వంలో రెవెన్యూ, ల్యాండ్ సర్వే, మరియు నీటిపారుదల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు. ఒక ప్రత్యేక కమిటీ ద్వారా నారాయణపూర్ బాధితుల సమస్యలపై సమగ్ర నివేదికను ముక్షమంత్రి ముందు ఉంచనున్నారు.

మరిన్ని వార్తలు