కుప్పకూలిన డ్రైనేజ్..
కొత్తగూడెం టౌన్, సెప్టెంబర్ 25, (విజయక్రాంతి): పట్టణ పరిధిలోని ఎంజి రోడ్ రూపా బేకరీ సమీపంలో డ్రైనేజ్(Collapsed drainage) పై వేసిన ఫుత్పాత్ ఒకసారిగా గురువారం రాత్రి కుప్పకూలింది. ఆ సమయంలో ఫుట్పాత్ పై నడుస్తున్న పాదాచారులు కాలువలో పడి స్వల్ప గాయాల పాలయ్యారు. ఎంజీ రోడ్డు ఫుట్పాత్(MG Road footpath) శిథిలావస్థకు చేరిందని, నాసిరకంగా పనులు చేపట్టడంతోనే ఈ పరిస్థితి నెలకొందనే స్థానికులు ఆరోపిస్తున్నారు. తక్షణమే ఫుత్పాత్ పై మరమ్మత్తులు చేపట్టాలని, లేనిపక్షంలో మళ్లీ ప్రమాదాలు చోటు చేసుకుంటాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిస్థాయిలో పరిశీలన చేపట్టాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ని కోరుతున్నారు.. ప్రధానంగా వృద్ధులు, మహిళలు ఈ ఫుట్ పాత్ పై నడక సాగిస్తారు.. ఇలాగే వదిలేస్తే ప్రాణాలకే ప్రమాదం పొంచిఉంది.. శుక్రవారం వినాయక నిమజ్జనం కావడంతో ప్రజల అధిక సంఖ్యలో ఫుత్పాత్లపై చేరే అవకాశం ఉంది. అధికారులు తక్షణం మరమ్మత్తులు చేపట్టి భద్రత చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.