బర్త్ సర్టిఫికెట్ సమస్యలపై స్పందించిన కలెక్టర్
చేవెళ్ల, సెప్టెంబర్ 22(విజయక్రాంతి): బర్త్ సర్టిఫికెట్ల జారీ(Issuance of birth certificates)లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ‘విజయక్రాంతి’ దినపత్రికలో ప్రచురితమైన ‘అదెట్లా చెల్లని సంతకం సారు‘ వార్తా కథనానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి (Ranga Reddy District Collector C. Narayana Reddy)తక్షణమే స్పందించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో బాధితుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఆయన, పత్రికల్లో వచ్చే ప్రజా సమస్యల కథనాలపై అధికారులు వెంటే స్పందించి పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
పంచాయతీరాజ్ వ్బుసైట్ పనిచేయకపోవడంతో పాత బర్త్ సర్టిఫికెట్లు ఆన్లైన్ కాక, రెండేళ్లు దాటిన వారికి తహసీల్దార్లు ’నాన్ అవైలబిలిటీ(Non-availability)’ సర్టిఫికెట్లు ఇవ్వకపోవడం వల్ల ప్రజలు ఏళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని కథనం పేర్కొంది. మాన్యువల్ సర్టిఫికెట్ల(Manual certificates)ను ఆన్లైన్ చేసే ప్రక్రియలోని ఈ సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.