తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు రండి
ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శిని ఆహ్వానించిన మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 9 (విజయక్రాంతి): తెలంగాణ(Telangana)ను ప్రపంచ పెట్టుబడులు(Investments), వ్యవసాయ వాణిజ్యం(agricultural trade), పారిశ్రామిక అవకాశాల(industrial opportunities)కు ప్రధాన గమ్యస్థానంగా నిలిపే లక్ష్యంతో డిసెంబర్‌లో హైదరాబాద్(Hyderabad)లో నిర్వహించను న్న ప్రతిష్ఠాత్మక తెలంగాణ రైజింగ్ సమ్మిట్(Telangana Rising Summit)కు హాజరుకావాల్సిందిగా ఫిలిప్పీన్స్ వ్యవసాయ శాఖ కార్యదర్శి ఫ్రాన్సిస్కో పి టియు లారెల్ జూనియర్‌ను మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి(Uttam Kumar Reddy) ఆహ్వానించారు. ఢిల్లీలో ఫ్రాన్సిస్కో పిటియు లారెల్‌తో ఉత్తమ్ బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యత, ఉత్పాదక సా మర్థ్యం, ఎగుమతి అవకాశాలను ఆయనకు వివరించడంతోపాటు తెలంగాణ రైజింగ్ స మ్మిట్ లక్ష్యాలు, రాష్ట్రంలో అందుబాటులో ఉన్న పెట్టుబడి అవకాశాలను వివరించారు. తెలంగాణ నుంచి పెద్ద పరిమాణంలో బి య్యాన్ని కొనుగోలు చేసే అవకాశాలను పరిశీలిస్తామని పి టియు లారెల్ జూనియర్ సానుకూలంగా స్పందించినట్లు ఉత్తమ్ వెల్లడించారు. తెలంగాణలో నాణ్యమైన మాంస ఉత్పత్తులు, అత్యుత్తమ ప్రమాణాలతో కూడి న విత్తనాల కొనుగోలుపైనా ఆసక్తి వ్యక్తం చేశారని తెలిపారు.
తెలంగాణ రైతు పండించిన ధాన్యానికి అంతర్జాతీయ మార్కెట్ ద్వారాలు తెరవడమే మా ప్రభుత్వ లక్ష్యం. బియ్యం ఎగుమతులు విస్తరించడం ద్వారా రైతులకు మెరుగైన ధరలు లభించడంతోపా టు రైస్‌మిల్లర్లు , విత్తన కంపెనీలు, మాంస ఉత్పత్తిదారులు, ఆహారశుద్ధి పరిశ్రమలకు అపారమైన అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. అని మంత్రి స్పష్టం చేశారు.