పరిహారం.. పరిహాసం!
- పాలేరు- మోతె లిఫ్ట్ ఇరిగేషన్‌కు కేటాయించిన భూమికి పరిహారం రాక అవస్థలు
- 0.2750 గుంటలకు పరిహారంపై స్పష్టత లేదంటున్న బాధితులు
- మాయమాటలతో అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని ఆరోపణ
- సర్వే నుంచి పరిహారం లెక్కల వరకు విచారణకు డిమాండ్
మోతె, సెప్టెంబర్20 : పంట పొలాల(Crop fields)కు నీరందించేందుకు చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు(Lift irrigation project).. తమకు మాత్రం కన్నీళ్లు మిగుల్చుతోందని ఓ వృద్ధ రైతు దంపతులు(Farmer couple) ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైప్లైన్ కోసం తమ భూమిని తీసుకుంటున్నా.. భూమి విస్తీర్ణం, విలువకు తగ్గట్టుగా నష్టపరిహారం(Compensation) అందడం లేదని ఆరోపిస్తున్నారు. సర్వే సమయంలో అసలు పరిహారం ఎంత వస్తుందో చెప్పకుండా వివిధ రకాలుగా నచ్చజెప్పి అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని వాపోతున్నారు. మండలంలోని బురకచర్లలో వెలుగుచూసిన ఈ వ్యవహారం ఇప్పుడు అధికారుల తీరుపై ప్రశ్నలు రేకెత్తిస్తోంది. దీంతో పరిహారం.. పరిహాసంగా.. మారిందనే అభిప్రాయాలు స్థానికంగా వ్యక్తమవుతున్నాయి.
ఇరవై ఏడున్నర గుంటలు ప్రాజెక్టు పరిధిలోకి..
మోతె మండలాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు చేపట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. సిరికొండ రెవెన్యూ పరిధిలోని బురకచర్లలో లిఫ్ట్ కు సంబంధించిన పైప్లైన్ కోసం పలువురు రైతుల భూములు ప్రాజెక్టు పరిధిలోకి వచ్చాయి. దీనిలో భాగంగా రైతు బండారు సంజీవరెడ్డితో పాటు మరో ఐదుగురికి చెందిన సర్వే నంబర్ లు 194, 195, 196 లలో మొత్తం ఇరవై ఏడున్నర గుంటల భూమి ప్రాజెక్టు పరిధిలోకి వచ్చినట్లు బాధితులు చెబుతున్నారు.
పరిహారం ఎంతని చెప్పకుండానే సంతకాలు?
లిఫ్ట్ ఏర్పాటుకు సంబంధించిన ల్యాండ్ రిక్వైర్ మెంట్ కు అధికారులు సర్వే నిర్వహించారు. ఈ సర్వే సందర్భంగా జీపీఓలు తమ భూమికి ఎంత పరిహారం వస్తుందో స్పష్టంగా వివరించకుండానే అగ్రిమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. అలాగే ఆరుగురిలో ఇప్పటికే ముగ్గురికి నష్టపరిహారం అందిందని మిగిలిన వారికి ఎదుకు అందలేదనే వివరాలు అడిగినా సరైన సమాచారం ఇవ్వడం లేదని వాపోతున్నారు.
తప్పని బెదిరింపులు
తమ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నించినప్పుడు సంబంధిత వ్యక్తులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారని దంపతులు ఆరోపిస్తున్నారు.ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఏం చేసుకుంటావో చేసుకో అంటూ సమాధానం ఇచ్చారని పేర్కొంటున్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమను కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
న్యాయం చేయాలి
లిఫ్ట్ ఇరిగేషన్ వల్ల రైతులకు న్యా యం జరుగుతుందని ఉద్దేశ్యంతోనే నా వాటా భూమిని ఇ చ్చా. ఇందుకు పరిహారం ఇస్తామని అ ధికారులు చెప్పారు. వారి మాట నమ్మే ఇ చ్చాను. అయితే ఇప్పుడు పరిహారం కొందరికి వచ్చింది నాతోపాటు మరో ఇద్దరికి రా లేదు. కార్యాలయాల చుట్టూ తిరగలేక ఇ బ్బంది పడుతున్నా.. అధికారులు నా బాధ ను అర్థం చేసుకొని పరిహారం వెంటనే అం దేలా చర్యలు తీసుకోవాలి.
బి.సంజీవరెడ్డి, బాధితుడు
ప్రతి రైతుకు పరిహారం అందేలా చూస్తా
లిఫ్ట్ ఇరిగేషన్‌కు భూ ములు ఇచ్చిన ప్రతి రైతు కు అందవలసిన నష్టపరిహారం గెజిట్ పబ్లికేషన్ లో ఉన్న భూమికి ఆర్డీ వో అధికరణతో ప్రతి రై తుకు నష్టపరిహారం అం దించడం జరుగుతుంది. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ లో భూమినిచ్చిన ప్రతి రైతుకు పూర్తిస్థాయి నష్టపరిహారంను అందేలా విధంగా చూస్తా
వెంకన్న, తాసిల్దార్, మోతె