దళితులు అంటే బీఆర్ఎస్ పార్టీకి గౌరవం లేదు

08-09-2026 | 08:27pm

కాంగ్రెస్ పార్టి ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు

చేగుంట,(విజయక్రాంతి): రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party)కి దళితులపై కొంచెం కూడా గౌరవం లేదని దానికి నిదర్శనమే సోమవారం అసెంబ్లీ వద్ద ఆ పార్టీ ఎమ్మెల్సీ అసెంబ్లీ స్పీకర్ పై తీవ్రమైన పదజాలం ప్రయోగించడం అని చేగుంట ఎస్సి సెల్ అధ్యక్షులు స్టాలిన్ నర్సిములు అన్నారు. చేగుంట మండల(Chegunta Mandal) కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు చేగుంటలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రంలో దొరలకు దళితులు అంటే చిన్న చూపుగా ఉందని దుయ్యబట్టారు. తక్షణమే బిఆర్ఎస్, పార్టీ దళితులకు క్షమాపణ చెప్పాలని వారన్నారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టి ఉపాధ్యక్షులు మసాయిపేట్ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ కోండి శ్రీనివాస్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు