గణేష్ మండపాలకు లడ్డూల పంపిణీ

16-09-2026 | 06:42pm

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు(Congress party leaders) గణేష్ మండపాలకు లడ్డూలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ... తాడ్వాయి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాల(Ganesh Mandals) వినాయకులకు పార్టీ తరఫున లడ్డూలను అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబీర్ శ్యామ్ రావు, బండారు లింగం, రంజిత్ రెడ్డి, శ్రీకాంత్, అనిల్, ప్రసాద్,రఘుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు