ఆర్థిక సాయం అందజేత
దండేపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని తాళ్లపేటకి చెందిన బొజ్జ గంగన్న ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా ఆయన కుటుంబాన్ని గురువారం కాంగ్రెస్(Congress) పార్టీ నాయకులు పరామర్శించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశాల మేరకు గంగన్న కుటుంబ సభ్యులను మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆకుల దుర్గ ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు కలిసి రూ. 5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ... గంగన్న కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లప్పుడూ సహకారం అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకులు ఆకుల రామయ్య, మాజీ సర్పంచ్ లింగారావు, మాజీ ఏఎంసి డైరెక్టర్ కనక జంగు పటేల్, మైనార్టీ అధ్యక్షులు నిహాల్ ఖాన్, వార్డు మెంబర్ కోవ నవీన్, సందని, దుర్గం రవీందర్, సింధం మహేష్, జిల్లపెల్లి వినయ్, మలేం రాకేష్, సోహెల్ ఖాన్, బానేష్, సురేష్, అంజి, సలీమ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.