21 August, 2026 | 10:59 AM

కొండా సురేఖపై సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటు

21-08-2026 10:26 AM

హైదరాబాద్: మంత్రి కొండా సురేఖపై(Minister Konda Surekha) కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. శుక్రవారం నాడు CLPలో 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టనున్నారు. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టడంతో రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది. సురేఖ కూతురు సుస్మిత(Konda Sushmita) వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తనకీ, సుస్మిత వ్యాఖ్యలకూ సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. సంబంధం లేకపోయినా కనీసం ఖండించరా? అంటూ ఎమ్మెల్యేలు సూటిగా ప్రశ్నించారు. సురేఖ వివరణ ఏ మాత్రం ఆమోదయోగ్యంగా లేదని కాంగ్రెస్ ఫైర్ అయింది. ఇప్పుడు సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మీటింగ్ పై ఉత్కంఠ నెలకొంది. కొండా సుస్మిత, సురేఖ తీరుపై సీఎం, టీపీసీసీ నుంచి ఢిల్లీ పెద్దల వరకూ అంతా సీరియస్ ఉన్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏమాత్రం ఉపేక్షించేది లేదని కాంగ్రెస్ లో స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గీతదాటితే చర్యలు తీసుకోవడం ఖాయమన్నట్లుగానే కదలికలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ లైన్ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించిన విషయం తెలిసిందే.