calender_icon.png 6 December, 2024 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒక విద్యాలయం లక్షలాదిమందికి విజ్ఞానాలయం

01-11-2024 01:30:29 PM

ఎంతో శ్రమిస్తేనే పాలమూరు యూనివర్సిటీలో లా, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు

త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన 

విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి 

మహబూబ్ నగర్, విజయ క్రాంతి : విద్యను అందుబాటులోకి తీసుకురావడం వల్ల లక్షలాదిమంది విద్యార్థులను ఉన్నత శిఖరాలకు అధిరోహించడానికి ఉపయోగపడుతుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎంతో గొప్ప లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. 9 నెలల కష్టానికి లభించిన ఫలితం పాలమూరు యూనివర్సిటీ నందు లా, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటుకు నిదర్శనం అన్నారు.

త్వరలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. హంగు హర్బాటలు కాదు కావలసింది ప్రజల మన్ననలు పొందడం, వారికి అవసరమైన సదుపాయాలను అడగకముందే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఎమ్మెల్యేలు శ్రీనివాస్ రెడ్డి, మధు సూదన్ రెడ్డి,  ఎంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. జైపాల్ రెడ్డి మెమోరియల్ లైబ్రరీని విశాలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ మహబూబ్ నగర్ జిల్లా తీసుకురావడంలో వారు చేసిన కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు.

పాలమూరు ప్రజల సంక్షేమం దృష్టిలో ఉంచుకొని నిరంతరం శ్రమిస్తున్నారని ప్రజలు ఈ విషయాన్ని గమనించవలసిన అవసరం ఉందన్నారు. గతంలో కేవలం రాజకీయ రణరంగం సృష్టించేందుకు మాత్రమే ఆ ప్రచారం ఈ ప్రచారం చేసుకుంటూ కాలం వెళ్లదీశారని ప్రజలకు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచి చేయాలంటే మనసులో ఉండాలి కానీ అంగుహార్ బాటలో కాదని, ప్రజలు ఎంతో సంతోషంగా జీవనం  కొనసాగిస్తున్నారని తెలిపారు. యూనివర్సిటీ పరిధిలో లా, ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు చారిత ఆత్మకంగా నిలిచిపోతుందని తెలియజేశారు. మునుముందు ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకట్ రెడ్డి, బెనహర్, తదితరులు ఉన్నారు.