గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు

02-10-2026 | 03:16pm

నిజాంసాగర్,అక్టోబర్ 2(విజయక్రాంతి ): జాతిపిత మహాత్మా గాంధీ జయంతి(Father of the Nation, Mahatma Gandhi) సందర్భంగా నిజాంసాగర్ మండల కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి శుక్రవారం నాడు నిజాంసాగర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రజా పండరి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ గారి దేశ సేవను, స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన పోషించిన చారిత్రాత్మక పాత్రను స్మరించుకున్నారు.

సత్యం, అహింస, సహనం, మానవత్వం వంటి గాంధీజీ ఆశయాలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు. మహాత్మా గాంధీ గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సత్యం, అహింస మార్గంలో సమాజ అభ్యున్నతికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రజా పండరి  పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మండలంలోని గ్రామ సర్పంచులు, గ్రామ అధ్యక్షులు, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు