సత్యం, అహింస, శాంతికి మార్గదర్శకుడు మహాత్మా గాంధీ

02-10-2026 | 05:15pm

వి.ఆధార్ష్ రెడ్డి బి.ఆర్.ఎస్ పార్టీ ఇన్‌చార్జ్   

రామచంద్రపురం: రామచంద్రపురం డివిజన్ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాల వద్ద ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి(MLA Gudem Mahipal Reddy), మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి తో కలిసి ఆదర్శ్ రెడ్డి గాంధీ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జాతీయ రహదారి విస్తరణలో భాగంగా తొలగించిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని గాంధీ జయంతి సందర్భంగా రామచంద్రాపురం జిల్లా పరిషత్ పాఠశాల వద్ద పునఃప్రతిష్ఠించి ఆవిష్కరించారు.

ఎల్.ఐ.జి బస్ స్టాప్ వద్ద మైనారిటీ నాయకులు అజీముద్దీన్, మునీర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో మాజీ ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి  పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లడుతు  గాంధీజీ చూపిన సత్యం, అహింస, శాంతి మార్గాలను ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, పరమేష్ యాదవ్, బూన్, ఐలేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు