కోర్టు తీర్పు ప్రజాస్వామ్య విజయం
19-09-2026 | 12:46pm
మెట్ పల్లి,సెప్టెంబర్ 19(విజయక్రాంతి): రాష్టంలో హైకోర్ట్ తీర్పు(High Court Verdict) ప్రజా స్వామ్య విజయం అని మెట్ పల్లి బిజెపి లీగల్ సెల్(BJP Legal Cell) నాయకులు కట్కం వేణుగోపాల్ అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ ఈ తీర్పు ప్రజాస్వామ్యానికి గర్వకరణం గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రోత్సహించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆదె దారిలో వెళ్లిందని తెలిపారు.
తెలంగాణ ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రెండు పార్టీలను నమ్మే పరిస్థితి లేదని వచ్చే ఎన్నికల్లో బిజెపి వైపు నిలవడం ఖాయమని అన్నారు. గతంలో టిఆర్ఎస్ కు చెప్పిన గుణపాఠం తెలంగాణ ప్రజలు ఇప్పుడు ప్రజాపాలన ఆని చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీకి కూడా తమ ఓటుతో జవాబు ఇస్తరని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారని పేర్కొన్నారు.