ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌లపై ఉక్కుపాదం
అమెజాన్, స్విగ్గీ, బిగ్‌బాస్కెట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌పై ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ కఠిన చర్యలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 23: తప్పుదోవ పట్టించే ప్రకటనలు(Announcements), నిషేధిత ఉత్పత్తుల అమ్మకం(Sale of banned products)తో సహా పలు నిబంధనల ఉల్లంఘనల కు ఈకామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల(Ecommerce platforms)పై ఆహార నియంత్రణ సంస్థ(Food Regulatory Authority) ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఉక్కుపాదం మోపుతోంది. అమెజాన్, స్విగ్గీ, ఇన్ స్ట్టామార్ట్, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ ఇండియా, జెప్టో(Amazon, Swiggy, Instamart, BigBasket, Flipkart India, Zepto)లపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని బుధవారం తెలిపింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండరడ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
అమెజాన్, స్విగ్గీ, ఇన్‌స్టామా ర్ట్, బిగ్‌బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ ఇండియా, జెప్టోల తో సహా ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు నిబంధనల ఉల్లంఘనలలో తప్పుడు బ్రాండిం గ్/తప్పుదారి పట్టించే వాదనలు, అలాగే నిషేధిత/ విషపూరి త ఆహార పదార్థాల అ మ్మకం, ప్రదర్శన కూడా ఉన్నాయని పేర్కొం ది. గత ఆరు నెలలుగా, ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆహార వ్యాపార నిర్వాహకులు (ఎఫ్‌బీఓలు), ఈ-కామర్స్ కంపెనీలపై కఠిన చర్యలను ముమ్మరం చేసింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ చర్యల గురించి విని యోగదారులకు కూడా తెలియజేస్తోంది.