సీఆర్‌ఈ శిక్షణ విజయవంతం
కొత్తగూడెంటౌన్, ఆగస్టు 18, (విజయక్రాంతి): భద్రాద్రి జిల్లా ఆనందకని స్కూల్లో రెండు రోజుల పాటు నిర్వహించిన ట్రాన్సిషన్ మోడల్ ఇన్ ఎడ్యుకేషన్, స్కిల్ డెవలప్మెంట్ ఫర్ బి డబ్ల్యూ డి ఎస్ అనే అంశంపై నిర్వహించిన సిఆర్‌ఈ శిక్షణ కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో రెండవ రోజు శిక్షణకు నూతనంగా భద్రాద్రి జిల్లా ఐ ఈ డి, సీఎంఓ కోఆర్డినేటర్ టి.రామారావు హాజరై, శిక్షణలో పాల్గొన్న స్పెషల్ ఎడ్యుకేటర్లు, ఐఆర్పిలను ఉద్దేశించి విలువైన సందేశాన్ని అందించారు.
ఇలాంటి ప్రత్యేకమైన శిక్షణ కార్యక్రమాల ద్వారా పొందిన జ్ఞానం, నైపుణ్యాలను సద్వినియోగం చేసుకొని, భద్రాద్రి జిల్లాలోని దివ్యాంగ పిల్లలకు మరింత నాణ్యమైన విద్యను అందించడంతో పాటు, వారి సామర్థ్యాలు, నైపుణ్యాలను అభివృద్ధి చేసి, భవిష్యత్తులో వారు స్వయం ఆధారితంగా ఎదగడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించిన కోర్స్ కో ఆర్డినేటర్లు పగడపల్లి రాజేంద్ర, మార్గం శ్యామ్ , రత్న భూషణ్‌లను ప్రత్యేక అభినందించారు.






