మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ
మట్టి వినాయకులను పూజిద్దాం - పర్యావరణం కాపాడుకుందాం
సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి
కొడిమ్యాల, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామ పంచాయతీ(Kodimyala Gram Panchayat) ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ గడ్డం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. వినాయక చవితి పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని, మట్టి గణపతి ప్రతిమలను ఉపయోగించడం వల్ల పూజ అనంతరం నిమజ్జనం సమయంలో నీటి వనరులు కలుషితం కాకుండా ఉంటాయని, ప్లాస్టర్ ఆఫ్ పారిస్, రసాయన రంగులతో తయారైన విగ్రహాల వల్ల చెరువులు,కాలువలు, ఇతర నీటి వనరులకు నష్టం కలిగే అవకాశం ఉందని,అందువల్ల ప్రతి ఒక్కరూ మట్టి గణపతి ప్రతిమలను ప్రోత్సహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుర్రం నర్సయ్య, వార్డు సభ్యులు రాపర్తి నర్సింగరావు,చిట్టిపాక రమేష్,బోగ రవి,గాలిపెల్లి రాజు,అజయ్,శేఖర్,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.