30-08-2025 07:10:53 PM
కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం జి ఆర్ కాలనీ వాసులకు రగ్గులు, బట్టలను, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పంపిణీ చేశారు. సీనియర్ న్యాయవాదులు జగన్నాథం, శ్యాం గోపాల్ రావు, వెంకటరామిరెడ్డి, బాధితులకు పంపిణీ చేశారు. వరదల వల్ల ఇంట్లో ఉన్న వస్తువులతోపాటు బట్టలు కూడా బురదమయంలో చిక్కుకొని పనికి రాకుండా పోయాయి. కట్టు బట్టలతో బయటకు వెళ్లి ప్రాణాలు రక్షించుకున్న బాధితులకు బట్టలను పంపిణీ చేసినట్లు న్యాయవాదులు జగన్నాథం, శ్యామగోపాలరావు లు తెలిపారు.