గణనాథుడికి ఘనమైన వీడుకోలు పలికిన జిల్లా ఎస్పీ
25-09-2026 | 10:40pm
నిమజ్జన వేడుకల్లో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎస్పీ దంపతులు
ములుగు, (విజయక్రాంతి) : తొమ్మిది రోజులపాటు భక్తుల నుండి విశేష పూజలు అందుకున్న గణనాథలు గంగమ్మ చెంతకు చేరుతున్నారు. తొమ్మిది రోజులు పాటు పూజలు చేసిన గణనాథుడి ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్(Mulugu District SP Sudheer Ramnath Kekan) దంపతులు కుటుంబ సమేతంగా శుక్రవారం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. గణనాధున్ని స్వయంగా మోసుకు వెళ్లిన ఎస్పి నీటిలో నిమజ్జనం చేశారు. కుటుంబ సమేతంగా ఎస్పీ ఈ కార్యక్రమంలో పాల్గొనడం భక్తులకు ప్రత్యేక ఉత్సాహాన్ని ఇచ్చింది.