14-01-2026 04:00:02 PM
జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
జిల్లా పోలీస్ కార్యాలయంలో అంబరాన్ని అంటిన భోగి,సంక్రాంతి సంబరాలు
ఎస్పీ ఆధ్వర్యంలో ‘కైట్ ఫ్లయింగ్ ఫెస్టివల్’ ఘనంగా నిర్వహణ
భోగి మంటలు, రంగురంగుల పతంగుల సందడితో ఉత్సాహంగా గడిపిన పోలీస్ కుటుంబాలు
అధికారులు, సిబ్బంది, కుటుంబ సభ్యులతో కలిసి పతంగులు ఎగురవేసిన జిల్లా ఎస్పీ
కామారెడ్డి,(విజయక్రాంతి): పండుగలు మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. బుధవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో పోలీస్ కుటుంబాలతో కలిసి కైట్ ఫెస్టివల్ నిర్వహించారు. అంతకుముందు భోగి మంటలు కాల్చారు. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ పండుగ వేడుకలు పోలీస్ కుటుంబాల మధ్య ఐక్యతను పరస్పర స్నేహాన్ని మరింత బలపేతం చేస్తాయన్నారు.
నిరంతరం విధుల్లో నిమగ్నమయ్య పోలీస్ సిబ్బందికి ఈ తర కార్యక్రమాలు మానసిక ఉల్లాసాన్ని కొత్త ఉత్సవాన్ని అందిస్తాయన్నారు. అదేవిధంగా పతంగులు ఎగురవేసే సమయంలో చైనీస్ మాంజా నైలాన్ మాంజా వాడకూడదని తెలిపారు. మాంజా వాడడం వల్ల పక్షులకు మాత్రమే కాకుండా వాహనదారుల ప్రాణాలకు కూడా తీవ్రమైన ముప్పుగా మారుతాయి అని ప్రజలుగా గ్రహించాలని కోరారు. కైట్లను ఎగుర వేసేందుకు నువ్వులు దారం మాత్రమే ఉపయోగించాలని సూచించారు. పండుగ లు ఆనందాన్ని పంచాలి కాని విషాదాన్ని మిగిల్చకూడదని ఎస్పి అన్నారు.
సాంప్రదాయాలను గౌరవిస్తూ భద్రత నియమాలను పాటించాలన్నారు. ప్రతి కుటుంబం సురక్షితంగా ఆనందంగా ఉండాలన్నదే పోలీస్ శాఖ సంకల్పమని ఎస్పీ తెలిపారు. జిల్లా ప్రజలకు ఎస్పీ రాజేష్ చంద్ర భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఎస్పీ కార్యాలయం ఆవరణలో భోగి మంటలను కాచి పతంగులను కుటుంబ సభ్యులతో కలిసి ఎగురవేస్తూ ఆనంద ఉత్సవాలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, ఏఎస్పి చైతన్య రెడ్డి, ఆ రైలు సంతోష్ కుమార్ కృష్ణ ఆర్ఎస్ఐలు, జిల్లా పోలీస్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.