మండపాలలో డీజేలకు అనుమతులు లేవు
12-09-2026 | 06:12pm
అశ్వారావుపేట,(విజయ క్రాంతి): అశ్వారావుపేట మండల(Ashwaraopet Mandal) పరిధిలో ఏర్పాటు చేసే వినాయక మండపాల(Ganesh Mandals) వద్ద డీజే (DJ) సౌండ్ సిస్టమ్‌లకు ఎటువంటి అనుమతులు ఇవ్వడం జరగదని అశ్వారావుపేట ఎస్ఐ యయాతి రాజు(Ashwaraopet SI Yayati Raju) తెలిపారు. శనివారం విడుదల చేసిన ప్రకటనలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా శబ్ద కాలుష్య నిబంధనలను అతిక్రమించి, అనుమతి లేకుండా డీజేలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి. నిబంధనలు ఉల్లంఘించిన మండప నిర్వాహకులు, డీజే యజమానులపై చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి, డీజే పరికరాలను స్వాధీనం చేసుకుంటామని ఎస్ఐ తెలిపారు. మండప నిర్వాహకులు శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, శబ్ద పరిమితులను పాటిస్తూ, పోలీసు వారి సూచనల మేరకు ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆయన కోరారు.