గణేష్ ఉత్సవ కమిటీలకు విరాళం

16-09-2026 | 04:25pm

దామరచర్ల మండలంలోని ఉత్సవ కమిటీ లకు అందజేత

దామరచర్ల: మిర్యాలగూడ నియోజకవర్గంలో గణేష్ ఉత్సవాలు(Ganesh Festivals) నిర్వహించే ప్రతి కమిటీకి బిఎల్ఆర్ బ్రదర్స్ ఆధ్వర్యంలో రూ. 5,116 ఆర్థిక సహాయం అందిస్తామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి(MLA Bathula Lakshma Reddy) ప్రకటించారు. ఇందులో భాగంగా  దామరచర్ల మండలం దామరచర్ల వాడపల్లి, ఇరికిగూడెం, వీర్లపాలెం గ్రామాల్లో గణేష్ ఉత్సవాలు నిర్వహిస్తున్న కమిటీలకు రూ.5,116 చొప్పున విరాళాన్న దామరచర్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొర్ర నాగు నాయక్ అందజేశారు.

ఈ కార్యక్రమంలో గాజుల శ్రీనివాస్, అంజిరెడ్డి రవితేజ నాయక్, బంటు కిరణ్, గాలం వెంకన్న యాదవ్, సర్పంచులు బంటు రేణుక శ్రీ, పద్మం సత్యనారాయణ, నాగు నాయక్,  గాలి ప్రియాంక,  గాలం వేణు శ్యాంసుందర్ రెడ్డి, మనం నాగయ్య, మోహన్ రెడ్డి, కిషన్ నాయక్, మధు,  క్రాంతి సందీప్, మనోజ్ నాయుడు, దుర్గ, చెన్నయ్య, గోవింద్ రెడ్డి, చెన్నకేశవులు, అలుగుల దుర్గారావు, బాబు నాయక్, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు