డా.అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్స్ గడువు పొడిగింపు

10-09-2026 | 01:13pm

ప్రకటనలో తెలిపిన కళాశాల కో-ఆర్డినేటర్ కె. సూర్యనారాయణ.

చేవెళ్ళ సెప్టెంబర్ 10(విజయక్రాంతి): చేవెళ్ల పరిసర ప్రాంత విద్యార్థులకు తెలియజేయునది ఏమనగా, డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ(Dr. Ambedkar Open University ) డిగ్రీ మొదటి సంవత్సరం B.A., B.Com., B.Sc. కోర్సులలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై సమాన అర్హత కలిగిన అభ్యర్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చని గురువారం కళాశాల కో-ఆర్డినేటర్ కె. సూర్యనారాయణ ప్రకటనలో తెలిపారు. అలాగే డిగ్రీ రెండు, మూడవ సంవత్సరం విద్యార్థులు తమ ట్యూషన్ ఫీజును చెల్లించవచ్చని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవలని కోరారు. దరఖాస్తు గడువు చివరి తేది సెప్టెంబర్ 30 వరకు పొడిగించామని పేర్కొన్నారు. పూర్తి వివరాల కొరకు  మొబైల్ నెం, 9908640914 సంప్రదించాలన్నారు.

మరిన్ని వార్తలు