విద్యుత్ కోతలకు నిరసనగా రైతుల రాస్తారోకో

10-09-2026 | 01:49pm

భారీగా నిలిచిపోయిన వాహనాలు.. 

రుద్రంగి సెప్టెంబర్ 10(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండల కేంద్రంలో రైతులకు 24 గంటల త్రీ-ఫేజ్ విద్యుత్(Three-phase electricity) సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తూ రైతులు, బీఆర్ఎస్ నాయకులు గురువారం రాస్తారోకో నిర్వహించారు.రుద్రంగి మండల కేంద్రంలో సబ్ స్టేషన్ వద్ద కోరుట్ల వేములవాడ జాతీయ రహదారిపై బైటాయించి నిరసన(Farmers protest) తెలుపుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేసారు. 24 గంటలు విధ్యుత్ ఇస్తున్నాం అని గొప్పలు చెప్పే రేవంత్ రెడ్డి కనీసం 10 గంటల కూడా ఇవ్వడం లేదని మండి పడ్డారు.

ఇప్పటికే వర్షాలు లేక కష్టాల్లో ఉన్న రైతులకు కరెంట్ లేకపోవడం వలన పంటలు ఎండి పోతున్నాయి పంటలు ఎండిపోతే దిగుబడి సరిగా రాక తీవ్రంగా నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేశారు.రైతుల ఆందోళనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి.పోలీసులు చేరుకొని విద్యుత్ అధికారులతో మట్లాడి సమస్య పరిష్కరిస్తామన్నారు.ప్రభుత్వం విద్యుత్ కోతల సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.ఈకార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు