ఆకట్టుకున్న డాక్టర్ గజల్ శ్రీనివాస్ గానం

27-09-2026 | 05:25am
  1. మారిషస్ రాష్ట్రపతి ఆహ్వానం మేరకు సందర్శన
  2. ఆ దేశపు సీనియర్ సిటిజన్స్‌తో ఆత్మీయ ముఖాముఖి

హైదరాబాద్, సెప్టెంబర్ 26(విజయక్రాంతి): ప్రఖ్యాత గజల్ గాయకుడు(Ghazal singer), ట్రిపుల్ గిన్నిస్ వరల్ రికార్డ్స్ గ్రహీత డాక్టర్ గజల్ శ్రీనివాస్(Dr. Ghazal Srinivas) ఇటీవల మారిషస్ పర్యటనలో భా గంగా మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకు ల్ ఆహ్వానం మేరకు ఆ దేశ స్టేట్ హౌస్(రాష్ట్రపతి భవన్)ను సందర్శించారు. ఈ సంద ర్భంగా గజల్ శ్రీనివాస్‌తో పాటు మారిషస్‌లోని ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రతినిధుల ను రాష్ట్రపతి సాదరంగా ఆహ్వానించారు.

2027 ఏప్రిల్‌లో మారిషస్‌లో నిర్వహించనున్న 5వ ప్రపంచ తెలుగు మహాసభల ఏ ర్పాట్లు, లక్ష్యాలు, కార్యక్రమాల గురించి రాష్ట్రపతి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో స్టేట్ హౌస్ సందర్శనకు వచ్చిన సీనియర్ సిటిజన్స్ బృందాన్ని రాష్ట్రపతి  ధరమ్‌బీర్ గోకుల్ స్వయంగా గజల్ శ్రీ నివాస్‌కు పరిచయం చేసి, వారికి సందేశం అందించవలసిందిగా కోరారు. డాక్టర్ గజల్ శ్రీనివాస్ సీనియర్ సిటిజన్లను ఉద్దేశించి ప్ర సంగిస్తూ, తన గజల్ గానం ద్వారా ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వం, సుహృద్భావం, మానవతా విలువలు, దేశాల మధ్య స్నేహ సంబంధాలు అనే సందేశాలను హృద్యంగా వినిపించారు.

తెలుగు గజల్స్‌లోని భావాలను వారికి వివరించి ఆలపించగా, అక్కడి వారిని విశేషంగా ఆకట్టుకున్నాయి.ఈ సందర్భంగా మారిషస్ రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకు ల్ మాట్లాడుతూ గజల్ శ్రీనివాస్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని అభినందించారు. ప్రపంచ శాంతి కోసం, వివిధ దేశాలుప్రజల మధ్య సుహృద్భావాన్ని పెంపొందించేందుకు ఆయన తన గజల్ గానం, శాంతి యా త్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే శ్రీమద్భగవద్గీత ప్రచారం ద్వారా చేస్తున్న సేవలను ప్రశంసించారు.రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్‌తో పాటు ఆయన సతీమణి బృందా గోకుల్  గజల్ శ్రీనివాస్ చేస్తున్న విశ్వశాంతి, సాంస్కృతిక సేవలను అభినందించారు. అనంతరం రాష్ట్రపతి ధరమ్‌బీర్ గోకుల్ గజల్ శ్రీనివాస్‌ను సత్కరించారు.


మరిన్ని వార్తలు