'డ్రంక్ అండ్ డ్రైవ్'లో 57 మందికి రూ. 5.6లక్షల జరిమానా
01-10-2026 | 09:50pm
- ఐదుగురికి జైలు శిక్ష*
- లైసెన్స్ లేని 33 మందికి రూ.1.65 లక్షల ఫైన్
సిద్దిపేట క్రైం, అక్టోబర్ 1 (విజయక్రాంతి) : సిద్దిపేట పట్టణ పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా చేపట్టిన వాహన తనిఖీల్లో(Vehicle inspection) 57 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు తెలిపారు. గురువారం వారిని సిద్దిపేట స్పెషల్ సెకండ్ క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కాంతారావు ఎదుట హాజరుపరిచామని పేర్కొన్నారు. విచారణ అనంతరం వారికి మొత్తం రూ.5.6 లక్షల జరిమానా, ముగ్గురికి 10 రోజులు, ఇద్దరికి రోజులు జైలు శిక్ష విధించారని తెలిపారు. అదేవిధంగా డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన 33 మందికి రూ.1.65 లక్షల జరిమానా విధించారని పేర్కొన్నారు.